Share News

మెస్సీ అరుదైన ఘనత.. ఎంఎల్ఎస్ చరిత్రలో వరుసగా రెండోసారి గోల్డెన్ బూట్!

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:07 PM

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. మేజర్ లీగ్ సాకర్ (MLS) చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో 'గోల్డెన్ బూట్' అవార్డు సాధించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు.

మెస్సీ అరుదైన ఘనత.. ఎంఎల్ఎస్ చరిత్రలో వరుసగా రెండోసారి గోల్డెన్ బూట్!
Lionel Messi

స్పోర్ట్స్ డెస్క్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. మేజర్ లీగ్ సాకర్ (MLS) చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో 'గోల్డెన్ బూట్' అవార్డు సాధించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇంటర్ మియామి తరఫున ఆడుతున్న 39 ఏళ్ల మెస్సీ.. ఎంఎల్ఎస్-2026లో మొత్తం 26 గోల్స్ సాధించి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.


ఎంఎల్ఎస్-2026లో భాగంగా ఇంటర్ మియామి, షార్లెట్ ఎఫ్‌సీ మధ్య జరిగిన చివరి రెగ్యులర్ సీజన్ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ ఏమి చేయలేదు. అయితే అంతకుముందు సాధించిన గోల్స్ ఆధిక్యంతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఎఫ్‌సీ డల్లాస్ స్ట్రైకర్ పెటార్ ముసా 22 గోల్స్‌తో రెండో స్థానంలో, నాష్‌విల్లే ఎస్‌సీకి చెందిన సామ్ సూరిడ్జ్ 21 గోల్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు.


ఈ సీజన్‌లో మెస్సీ కేవలం గోల్స్ చేయడమే కాకుండా, 17 అసిస్ట్స్ కూడా అదించాడు. మొత్తం 80 గోల్స్ సాధించి టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన జట్టుగా ఇంటర్ మియామి నిలవడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 29 గోల్స్ చేసిన మెస్సీ గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు. ఈ ఏడాది కూడా గోల్డెన్ బూట్ సాధించి మేజర్ లీగ్ సాకర్లీగ్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ అరుదైన ఘనతతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

నెట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన టీమిండియా బౌలర్ అతడే: రహానే

చరిత్ర సృష్టించిన తానియా.. బీచ్ రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం

రెండో వన్డేలో గంభీర్, గిల్ వ్యూహాన్ని సమర్థించిన సునీల్ గావస్కర్!

Updated Date - Nov 08 , 2026 | 12:28 PM