చరిత్ర సృష్టించిన తానియా.. బీచ్ రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:14 AM
భారత్ రెజ్లర్ తానియా చరిత్ర సృష్టించింది. సెనెగల్ వేదికగా జరుగుతున్న యూత్ ఒలిపింక్స్ గేమ్స్ 2026 బీచ్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్ రెజ్లర్ తానియా చరిత్ర సృష్టించింది. సెనెగల్ వేదికగా జరుగుతున్న యూత్ ఒలిపింక్స్ గేమ్స్ 2026 బీచ్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించింది. సాలీ బీచ్ వెస్ట్ వేదికగా జరిగిన స్వర్ణ పోరులో చైనాకు చెందిన మిన్ ఝావో చేతిలో తానియా 1-2 తేడాతో ఓటమి పాలైంది. మిన్కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ తానియా విజయ తీరాలకు చేరలేకపోయింది. యూత్ ఒలింపిక్స్ గేమ్స్ 2026లో తొలిసారి అడుగుపెట్టిన తానియా అద్భుత ప్రదర్శన చేసింది.
బీచ్ రెజ్లింగ్ 79 కేజీల విభాగంలో తానియా రజత పతకం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఏడు మెడల్స్ చేరాయి. స్వర్ణాలు లేనప్పటికీ మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శనతో తానియా పోడియం వరకు చేరుకుంది. అక్కడ గ్రూప్-బిలో తన మూడు బౌట్ల్లోనూ తానియ విజయం సాధించింది. జర్మనీకి చెందిన మియా బాయర్పై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ దశలో బోణీ కొట్టింది. ఆ తర్వాత గ్రీస్ రెజ్లర్ కరవానౌను ఓడించింది. నాకౌట్ దశలో అమెరికాకు చెందిన మటిల్టా హ్రూబీని 3-1తేడాతో తానియ మట్టికరిపించి.. స్వర్ణ పోరుకు అర్హత సాధించింది. తుదిపోరులో బలమైన చైనా రెజ్లర్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పసిడిని అందుకోలేకపోయింది. అయినప్పటికీ రజతం సాధించి బీచ్ రెజ్లింగ్ క్రీడలో భారత్ కు మొట్టమొదటి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా తానియా రికార్డు సృష్టించింది.
ఇవి కూడా చదవండి:
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
మహ్మద్ షమీకి తగిన వీడ్కోలు దక్కలేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..