Share News

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:38 AM

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..
Josh Tongue

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తుండగా టంగ్ కాలి వేలికి గాయమైనట్లు ఈసీబీ తెలిపింది.


వన్డే సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న టంగ్‌.. తదుపరి వైద్య పరీక్షల కోసం తిరిగి యూకేకు పయనమయ్యాడు. మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్లను ఈసీబీ ప్రకటించింది. జోష్ టంగ్‌కు వన్డే జట్టులో మాత్రమే చోటుదక్కింది. గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగిన టంగ్ స్థానంలో జామీ ఓవర్టన్ తీసుకునే అవకాశం ఉంది. టంగ్ ఈ ఏడాది ఆరంభంలో బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు.


తన తొలి మ్యాచ్‌లో10 ఓవర్లలో ఒక వికెట్ తీసి 50 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం టంగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల పాకిస్థాన్ వేదికగా జరిగిన వన్డే త్రైపాక్షిక సిరీస్‌లో రాణించాడు. 2025-26 యాషెస్ సిరీస్‌లో కేవలం 3 టెస్టుల్లోనే 20.11 సగటుతో 18 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. మరోవైపు మోకాలి గాయం తర్వాత జాకబ్ బెథెల్ తిరిగి జట్టులోకి రాగా, ట్రై-సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఆర్చర్ కూడా జట్టులో చేరాడు. ఈనెల 13 నుంచి 18 మధ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.


ఇంగ్లండ్ వన్డే జట్టు

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్,


ఇవి కూడా చదవండి:

వరుణుడి అండతో గట్టెక్కారు

భారత్‌ ‘ఎ’ 227/2

దీపావళి కాంతులతో సుఖసంతోషాలు

Updated Date - Nov 08 , 2026 | 06:38 AM