భారత్ ‘ఎ’ 227/2
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:59 AM
భారత్ ‘ఎ’ జట్టు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (102) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో శనివారం న్యూజిలాండ్ ‘ఎ’తో...
జైస్వాల్ శతకం
లింకన్: భారత్ ‘ఎ’ జట్టు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (102) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో శనివారం న్యూజిలాండ్ ‘ఎ’తో ఆరంభమైన మూడో అనధికార టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 227/2 స్కోరుతో నిలిచింది. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (77 బ్యాటింగ్)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్‌కు 175 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం సాయితో కెప్టెన్ జురెల్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. దేవ్‌దత్ (15) నిరాశపర్చాడు. అయితే వర్షం కురవడంతో తొలిరోజు ఆట ముందుగానే ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News