Share News

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:47 AM

గ్లాండ్‌ ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.290.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు
profits

గ్లాండ్‌ ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.290.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.183.68 కోట్ల లాభంతో పోల్చితే 58.29శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.1,486.87 కోట్ల నుంచి రూ.1,833.58 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో అమెరికా మార్కెట్లోకి నాలుగు మాలిక్యూల్స్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.

కోరమాండల్‌ లాభంలో 34శాతం క్షీణత: సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 34శాతం క్షీణించి రూ.523.37 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.793.44 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7శాతం వృద్ధితో రూ.9,651.13 కోట్ల నుంచి రూ.10,294.13 కోట్లకు పెరిగింది.

ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ లాభం రూ.322 కోట్లు: ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.322 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, క్వాలిటీ కేర్‌ ఇండియా విలీనం తర్వాత ప్రకటించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.121.31 కోట్లుగా ఉంది. అయితే విలీనం కారణంగా ఫలితాలను పోల్చలేమని పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో రెవెన్యూ 1,197.21 కోట్ల నుంచి రూ.2,829.20 కోట్లకు పెరిగింది.


సిగ్మా అడ్వాన్స్‌డ్‌ ఆదాయం రూ.417 కోట్లు: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌..రూ.417 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.48.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం లో లాభం రూ.35.41 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.374.27 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ.. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర ఇన్వెస్టర్లకు ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు ద్వారా రూ.460 కోట్లు సమీకరించింది.

పెరిగిన స్ట్రింగ్‌ మెటావర్స్‌ లాభం: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.410.26 కోట్ల ఆదాయంపై రూ.39.86 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ సంస్థ స్ట్రింగ్‌ మెటావర్స్‌ వెల్లడించింది. ఈ కాలంలో కార్యకలాపాల ఆదాయం గణనీయంగా పెరగటం కలిసివచ్చిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

Updated Date - Nov 07 , 2026 | 02:08 AM