Share News

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:25 AM

కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఇండి యా.. వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్టు గురువారం ప్రకటించింది...

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

శ్రీసిటీ ప్లాంట్‌లో ఉత్పత్తుల తయారీ

న్యూఢిల్లీ: కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఇండి యా.. వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. వ్యాపార పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా దక్షిణ కొరియాలోని మాతృ సంస్థ గ్లోబల్‌ ఆటోమోటివ్‌ వ్యాపారాన్ని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆటోమోటివ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, టెలీమాటిక్స్‌ సొల్యూషన్స్‌తో సహా ఎల్‌జీ కొరియా గ్లోబల్‌ బీ2బీ ఆటోమోటివ్‌ వ్యాపారాన్ని భారత్‌కు తీసుకురానున్నామని, ఈ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఎల్‌జీ ఇండి యా ప్లాంట్‌లో తయారు చేసి సరఫరా చేయనున్నట్లు ఎల్‌జీ వెల్లడించింది.

క్యూ2 లాభం రూ.489 కోట్లు: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికాని (క్యూ2)కి ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఇండియా నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.65 శాతం పెరిగి రూ.489.34 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలం లో లాభం రూ.389.43 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 19.53 శాతం వృద్ధితో రూ.6,174 కోట్ల నుంచి రూ.7,380 కోట్లకు పెరిగింది.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:25 AM