లెక్క సరిచేయాలని!
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:43 AM
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌లు మరోసారి అభిమానులకు క్రికెట్ మజాను అందించడానికి సిద్ధమయ్యాయి. అండర్-19 ఆసియా కప్ గ్రూప్-ఎలో...
ఉదయం 10 గం. నుంచి
సోనీ నెట్‌వర్క్‌లో
నేడు పాకిస్థాన్‌తో భారత్ పోరు
అండర్-19 ఆసియా కప్
అల్ అమీరత్ (ఒమన్): చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌లు మరోసారి అభిమానులకు క్రికెట్ మజాను అందించడానికి సిద్ధమయ్యాయి. అండర్-19 ఆసియా కప్ గ్రూప్-ఎలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. గత టోర్నీలో భారత్‌ను పాక్ ఓడించింది. దానికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని లక్ష్య చందానీ సారథ్యంలోని భారత జట్టు కసితో ఉంది. తాజా టోర్నీలో ఇరుజట్లూ తమ తొలి మ్యాచ్‌లను గెలిచి జో్‌షలో ఉన్నాయి. నేపాల్‌ను భారత్.. యూఏఈని పాక్ ఓడించాయి. ఇక, ఇరువురి మధ్య పోరులో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా సెమీస్ బెర్త్‌ను కూడా దక్కించుకొనే అవకాశాలున్నాయి. మన జట్టులో సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్, ద్రవిడ్ కొడుకు అన్వయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మరోవైపు గత టోర్నీలో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ యూసఫ్ ఇప్పుడు కూడా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News