బస్తర్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.. సైనికులతో దీపావళి వేడుకలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:59 AM
కొన్ని సంవత్సరాల నుంచీ ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళిని జరుపుకొంటున్నారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఆయన బస్తర్‌కు బయలుదేరారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేడుకల కోసం ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు బయలుదేరారు. అక్కడ తీవ్రవాద శక్తులకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తిస్తున్న సైనిక దళాలతో కలిసి ఆయన పండుగ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇదివరకు నక్సలిజం కారణంగా నలిగిపోయిన బస్తర్ ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన తెలిపారు. అక్కడ తీవ్రవాదం నశించి, శాంతి నెలకొందని చెప్పారు. ‘దీపావళి వేడుకల కోసం నేను బస్తర్‌కు బయలుదేరాను. అక్కడ నక్సలిజాన్ని అణచివేసిన సైనిక దళాలతో కలిసి పండుగ సంబరాల్లో పాలుపంచుకోబోతున్నాను. ధైర్యవంతులైన భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలకు, నిస్వార్థ సేవకు, దేశం పట్ల వారి అచంచలమైన అంకితభావానికి అభివాదం చేయడానికే నేను వెళ్తున్నాను’ అని మోదీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
సంవత్సర కాలం నుంచి తీవ్రవాదం కారణంగా బస్తర్‌లో ఎలాంటి మరణాలూ సంభవించకపోవటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నక్సలిజం కారణంగా 2025, అక్టోబర్ 30న చివరి మరణం నమోదైంది. తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించినందుకు సైనికులను మోదీ అభినందించారు. కాగా కొన్ని సంవత్సరాల నుంచీ ప్రధాని మోదీ దీపావళిని సైనికులతో కలిసి జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఆయన బస్తర్‌కు పయనమయ్యారు.
ఈ వార్తలూ చదవండి
దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు..