Share News

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:28 PM

దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాలు సుఖసంతోషాలతో వెలిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాలు సుఖసంతోషాలతో వెలిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని చెప్పారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్‌లో ఈరోజు (శనివారం) వీడియో పోస్ట్ చేశారు. ‘పవిత్రమైన దీపావళి పండుగ మీకు ప్రశాంతతను, విజయాలను, సుఖసంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు. కాగా కొన్ని సంవత్సరాల నుంచీ మోదీ దీపావళిని సైనికులతో కలిపి జరుపుకొంటున్నారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తానని ఆయన వీడియోలో వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

పార్కింగ్ వివాదం.. టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ హత్య..

మనవరాలి కోరిక మేరకే వైదిక వివాహం.. విమర్శలపై డీఎంకే నేత స్పందన..

Updated Date - Nov 07 , 2026 | 06:30 PM