Share News

హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..

ABN , Publish Date - Nov 08 , 2026 | 11:55 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..
Gachibowli Family Incident

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బత్తుల మర్రిరెడ్డి కుటుంబం గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌లో కొంతకాలంగా నివాసం ఉంటోంది. అయితే, ఈరోజు (ఆదివారం) ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. ముగ్గురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించారు. మృతులను బత్తుల మర్రిరెడ్డి (65), ఆయన భార్య బత్తుల భారతి (60), కుమారుడు బత్తుల నిశాంత్ రెడ్డి (38)గా గుర్తించారు. నిశాంత్ రెడ్డి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరోవైపు, ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో సైబర్ మోసం.. గంటలోనే రూ.7.9 కోట్లు మాయం

అయోధ్యపై దుష్టశక్తుల చూపు పడనివ్వం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Nov 08 , 2026 | 11:55 AM