Share News

రెండో వన్డేలో గంభీర్, గిల్ వ్యూహాన్ని సమర్థించిన సునీల్ గవాస్కర్!

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:29 AM

రెండో వన్డేలో కేఎల్ రాహుల్ లాంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉండగా అక్షర్ పటేల్‌ను ముందుగా పంపడంపై పలువురు క్రికెట్ అభిమానులు విమర్శలు వ్యక్తం చేశారు. ఈ వ్యూహంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించారు.

రెండో వన్డేలో గంభీర్, గిల్ వ్యూహాన్ని సమర్థించిన సునీల్ గవాస్కర్!
Sunil Gavaskar

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వికెట్లను కోల్పోయి 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్‌కు బదులుగా ఎడమచేతి వాటం బ్యాటర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. అయితే, అక్షర్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ కావడంతో భారత్ స్కోరు 47/4కి పడిపోయి మరింత ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది జట్టును విజయావతారాలకు చేర్చారు.


కేఎల్ రాహుల్ లాంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉండగా అక్షర్ పటేల్‌ను ముందుగా పంపడంపై కొందరు క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యూహంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించారు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన గావస్కర్.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి వస్తే బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి వస్తుందని, దానివల్ల బౌలింగ్‌లో లయతప్పి పరుగులు రాబట్టే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.


'గంభీర్, గిల్ ఆలోచనా విధానంలో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ అక్షర్ పటేల్ గనుక పరుగులు సాధించి ఉంటే, గిల్ కెప్టెన్సీని అందరూ ప్రశంసించేవారు. ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు ఫలితాన్ని ఇస్తాయి. మరికొన్నిసార్లు విఫలం అవుతుంటాయి. రెండో వన్డేలో ఆ వ్యూహం ఫలించలేదు అంతే' అని గావస్కర్ పేర్కొన్నారు. అక్షర్ వెనుక కేఎల్ రాహుల్ లాంటి బలమైన బ్యాటర్ ఉన్నాడు కాబట్టే ఇటువంటి ప్రయోగాలు చేయడం సహజమని గావస్కర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..

మహ్మద్ షమీకి తగిన వీడ్కోలు దక్కలేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..

Updated Date - Nov 08 , 2026 | 08:41 AM