Share News

ప్రారంభం కానున్న కార్తీక మాసం.. ఎప్పటి నుంచి అంటే..

ABN , Publish Date - Nov 08 , 2026 | 11:33 AM

ఏడాదికి పన్నెండు మాసాలు ఉన్నా.. అందులో విశిష్టమైనవి కొన్ని మాత్రమే. మాఘమాసంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు, శ్రావణ మాసంలో శ్రీలక్ష్మిదేవి, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి, కార్తీకమాసంలో శివుడు, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.

ప్రారంభం కానున్న కార్తీక మాసం.. ఎప్పటి నుంచి అంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఏడాదికి పన్నెండు మాసాలు ఉన్నా.. అందులో విశిష్టమైనవి కొన్ని మాత్రమే. మాఘమాసంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు, శ్రావణ మాసంలో శ్రీలక్ష్మిదేవి, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి, కార్తీకమాసంలో శివుడు, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 2026, నవంబర్ 10వ తేదీ మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ఈ మాసం ముగియనుంది. ఈ మాసంలో పండుగలు అధికంగా ఉంటాయి.


ముఖ్య పండుగలు..

  • నవంబర్ 13 : నాగుల చవితి

  • నవంబర్ 14: నాగ పంచమి

  • నవంబర్ 16: మొదటి కార్తీక సోమవారం.

  • నవంబర్ 21: క్షీరాబ్ది ద్వాదశి

  • నవంబర్ 23: రెండో కార్తీక సోమవారం.

  • నవంబర్ 24: కార్తీక పౌర్ణమి.

  • నవంబర్ 30: మూడో కార్తీక సోమవారం

  • డిసెంబర్ 06: నాలుగో కార్తీక సోమవారం (మాస శివరాత్రి).


ఈ మాసంలో..

ఈ నెలలో భక్తులు తెల్లవారుజామున నిద్ర లేచి పవిత్ర స్నానం ఆచరించి.. శివాలయాలకు వెళ్తారు. ఈ నెలంతా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. భక్తుల శివ నామస్మరణతో దేవాలయాలు మార్మోగుతాయి. తులసి మొక్క వద్ద ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. ఈ నెల మొత్తం నిత్యం రెండు పూటల ఆవునెయ్యితో దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటైన కార్తీకంలో.. భక్తులు నియమ నిష్ఠలకు ప్రాధాన్యం ఇస్తారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. కొందరు కార్తీక సోమవారాలు.. ఉపవాసం పాటిస్తారు. ఈ మాసంలో నదీ, సముద్ర స్నానాలు ఆచరిస్తారు.

ఈ మాసంలో నాగులచవితి, నాగ పంచమి వేళ.. భక్తులు సర్ఫ క్షేత్రాలకు పొటెత్తుతారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువుదీరిన శ్రీసుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు.

Updated Date - Nov 08 , 2026 | 12:44 PM