నా పంట పోతే.. నేనే బాధ్యుణ్ని!
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:41 AM
రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా నెలకొన్న కరువు పరిస్థితులతో యాసంగిలో వరి పంట వేయవద్దని చెప్పిన ప్రభుత్వం.. దీనిని పట్టించుకోని రైతులకు ఓ కండిషన్ పెడుతోంది.
ప్రభుత్వానికి.. ఇతరులకు ఎలాంటి సంబంధం లేదు
ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే రైతులకు వరి విత్తనాలు
డిక్లరేషన్ తీసుకోవాలని విత్తన వ్యాపారులకు
ప్రభుత్వం ఆదేశాలు.. యాసంగిలో తగ్గనున్న సాగు
వరంగల్ వ్యవసాయం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా నెలకొన్న కరువు పరిస్థితులతో యాసంగిలో వరి పంట వేయవద్దని చెప్పిన ప్రభుత్వం.. దీనిని పట్టించుకోని రైతులకు ఓ కండిషన్ పెడుతోంది. ప్రభుత్వం వద్దని చెప్పినా వరి పంట వేసుకోవాలనుకునే రైతులు ఆ పంట పండినా, పండకపోయినా.. బాధ్యత తమదేనంటూ స్వీయ అంగీకార పత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) ఇవ్వాలని నిబంధన విధిస్తోంది. ఈ డిక్లరేషన్ ఇచ్చిన రైతులకే వరి విత్తనాలు ఇవ్వాలని విత్తన వ్యాపారులను కారణంతోగానీ పంట ఎండిపోతే ప్రభుత్వానికి గానీ, డీలర్లకు గానీ సంబంధం లేదు’’ అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
సాగునీటి సౌకర్యం ఉండి, వరి తప్ప వేరే పంట సాగు చేయలేని పరిస్థితి ఉన్న రైతులు ఈ నిబంధనకు అంగీకరించి, డిక్లరేషన్ సమర్పించి విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న పది నెలల పాటు మరింత ఎండలు, విద్యుత్ కోతలు, తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోయినందున యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు..
ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల బాట పట్టారు. ఊరూరా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో తలెత్తే పరిణామాలను వివరిస్తున్నారు. వరికి బదులుగా ఆయిల్‌పామ్, కూరగాయలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు వంటివి పండించాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో యాసంగిలో పంటల సాగు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లాలో సాధారణంగా వానాకాలంలో 2.75 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. యాసంగిలో 1.50 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. అయితే ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రస్తుతం 30 శాతం మాత్రమే, అది కూడా ఆరుతడి పంటలే సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్ల్లు, బావులు, నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రైతుల యాసంగి పంటలు సాగు చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’
చస్తేనే నిధులిస్తామంటే చచ్చిపోతా..!
కాలాపత్తర్ బాల్యవివాహం కేసులో నలుగురి అరెస్టు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News