Share News

ఏ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:51 PM

రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో జరిగిన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఏ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీ బీజేపీ చీఫ్
Telangana BJP Chief N Ramchander Rao

జనగామ, ఏప్రిల్ 05: రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో జరిగిన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆదివారం జనగామలో టీ బీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని విధాల ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రమే నగదు ఇస్తుందని వివరించారు. రాష్టంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకు పోయిందంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎవ్వరు కూడా తృప్తిగా లేరన్నారు.


ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు యుద్ధాలతో ఇబ్బంది పడుతున్నారు కానీ.. దేశంలో మోదీ నాయకత్వంలో మాత్రం ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ కొరత లేకున్నా గ్యాస్, పెట్రోల్ కొరత ఉందంటూ ఫేక్ ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్‌పై ఎన్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో లాక్ డ్రైన్లు, బ్రేక్ డౌన్లు‌ ఉండవని ఎన్ రాంచందర్ రావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

మన్యం జిల్లాలో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

For More TG News And Telugu News

Updated Date - Apr 05 , 2026 | 01:17 PM