Share News

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:30 AM

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది.

వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది. ఈ చమట రూపంలో శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. అలాంటి వేళ.. సరైన ఆహారం తీసుకోకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచేందుకు వైద్య నిపుణులు పలు ఆరోగ్య సూచనలు చేస్తున్నారు. నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఇవిగో చిట్కాలు..

  • దాహం వేసినా వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

  • పుచ్చకాయ, కర్పూజా వంటి పండ్లలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి అవరమైన విటమిన్లను సైతం అందిస్తుంది.

  • తినే భోజనంలో పెరుగు లేదా మజ్జిగ వేసుకోవాలి. వీటిలోని ప్రో బయోటిక్స్ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • సలాడ్ రూపంలో దోసకాయ తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి చలవ చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.


  • ఈ వేసవిలో కారం, గరం మసాలు వినియోగాన్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.

  • నూనెలో వేయించిన ఆహార పదార్థాలు.. సమోసాలు, పకోడీలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఇవి శరీర ఉష్ణోగ్రతలను పెంచుతాయి.

  • కూల్ డింక్స్, రకరకాల రంగుల సోడాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. ఇవి శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.


  • రాత్రి వేళ తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది.

  • మరి దాహం వేస్తే.. సుగంద సోడా, కోటోరా గోధుమ వంటివి నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని అధిక ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి.

  • ఈ వేసవిలో సాధ్యమైనంత వరకు మజ్జిగను తీసుకోవాలి. అది కూడా చాలా పల్చగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నిమ్మకాయ పిండుకుని తాగితే వేసవి తాపం తగ్గడమే కాకుండా శరీరారాని విటమిన్ సి సైతం అందుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజనంలోకి ... ‘సంజీవని’

పేపర్ ప్లేట్‌లో తింటే క్యాన్సర్ వస్తుందా?

For More Health News And Telugu News

Updated Date - Apr 05 , 2026 | 12:59 PM