Share News

క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్స్‌లో ఎస్సార్‌యూకు 701-710 ర్యాంక్‌ బ్యాండ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:43 AM

క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్స్‌లో ఎస్సార్‌ యూనివర్సిటీ 701-710 ర్యాంక్‌ బ్యాండ్‌ సాధించిందని వర్సిటీ చాన్స్‌లర్‌ వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్స్‌లో ఎస్సార్‌యూకు 701-710 ర్యాంక్‌ బ్యాండ్‌
SR University Warangal

  • వర్సిటీ చాన్స్‌లర్‌ వరదారెడ్డి

వరంగల్‌ ఎడ్యుకేషన్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్స్‌లో ఎస్సార్‌ యూనివర్సిటీ 701-710 ర్యాంక్‌ బ్యాండ్‌ సాధించిందని వర్సిటీ చాన్స్‌లర్‌ వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హనుమకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సార్‌ యూనివర్సిటీ ఏకంగా మూడు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో విశేష గురింపు సాధించి సత్తా చాటిందన్నారు. క్యూఎస్‌ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌, యూఐ గ్రీన్‌మెట్రిక్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో స్థానం సాధించడం వర్సిటీ విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, నిబద్ధతకు నిదర్శనమని వెల్లడించారు.


తొలి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు సాధించడమే కాకుండా 58.9శాతం సంస్థలను అధిగమించి ర్యాంకు బ్యాండ్‌ను సొంతం చేసుకుందన్నారు. భారతదేశంలో 104వ స్థానాన్ని, దేశంలోని రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 19వ స్థానాన్ని కైవసం చేసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దీపక్‌ గార్గే, రిజిస్ట్రార్‌ రమణారావు పాల్గొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:43 AM