SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:43 PM
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.
హనుమకొండ, జూన్ 22: SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. హనుమకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజంట్ల శిక్షణా కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొని ప్రసంగించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్‌లో ఓట్ చోరీ చేసి అడ్డదారిన బీజేపీ గెలిచిందని దుయ్యబట్టారు. ఓట్లేకాదని.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటును కూడా దొంగిలించారని విమర్శించారు. ఇక దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎక్కడుందని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారని.. అందుకే వాస్తవాలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామని మహేశ్ తెలిపారు. కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని నిలదీశారు. పదేళ్లలో జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఆస్తుల కోసం చెల్లిని గెంటేసిన కేటీఆర్ ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు విషయంలో బీఆర్ఎస్ తీరు బీజేపీకి బలం చేకూర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తున్నామని.. కాస్త ఆలస్యం కావడంలో తమ తప్పిదం ఉందన్నారు. తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి
దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ టూరిజం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Latest Telangana News And Telugu News