Share News

నిట్‌కు రూ.4 కోట్ల ప్రాజెక్టు మంజూరు

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:20 AM

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) కింద వరంగల్‌ ఎన్‌ఐటీకి రూ.4కోట్ల విలువైన ప్రాజెక్టు మంజూరైంది.

నిట్‌కు రూ.4 కోట్ల ప్రాజెక్టు మంజూరు
NIT Warangal

హనుమకొండ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) కింద వరంగల్‌ ఎన్‌ఐటీకి రూ.4కోట్ల విలువైన ప్రాజెక్టు మంజూరైంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌), వెబ్‌ డిజైనింగ్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్‌ ఈ ప్రాజెక్టును సమన్వయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2027 మార్చి నాటికి 1200మంది నిరుద్యోగ యువతకు శిక్షణ అందించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:20 AM