Share News

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:35 PM

కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి
Kadiyam Srihari

జనగామ, ఏప్రిల్ 21: సకల జనుల పోరాటం, ఎందరో ఆత్మబలిదానాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. ఇప్పుడు వాళ్లే నీతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ‘నేను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి రాజకీయాలలో నిలబడగలిగాను’ అని ఎమ్మెల్యే వెల్లడించారు.


అవినీతి, అక్రమాలకు దూరంగా ఉన్నానని.. అందుకే 35 ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో తప్పుడు పనులు చేసి తలవంపులు తీసుకువచ్చిన వారు చాలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గ ప్రజలు గర్వపడే విధంగానే నా పని తీరు ఉంటుంది’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 03:45 PM