Share News

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:22 PM

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల ప్రక్రియ మే 1 నుంచి మే 31 వరకు జరగనుంది.

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
TG Govt

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 38ను విడుదల చేసింది. ఈ బదిలీల ప్రక్రియ మే 1 నుంచి మే 31 వరకు జరగనుంది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట పోస్టింగ్‌లో ఉండరాదని స్పష్టం చేసింది.


భార్యాభర్తలు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ముందుగా ప్రాధాన్యం ఉండనుంది. మొత్తం ఉద్యోగులలో 40 శాతానికి మించకుండా మాత్రమే బదిలీలు చేపట్టాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 02:47 PM