Share News

ప్రహరీ నిర్మాణ పనులు చేపడతాం

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:31 AM

కాకతీయ యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనుల విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

ప్రహరీ నిర్మాణ పనులు చేపడతాం
KU Compound Wall

  • కేయూ అధికారులకు టీజీఈడబ్ల్యూఐడీసీ సమాచారం

  • ఈ నెల 7న తుది ఒప్పందం చేసుకుంటామన్న సంస్థ

  • హర్షం వ్యక్తం చేస్తున్న కాకతీయ యూనివర్సిటీ వర్గాలు

కేయూ క్యాంపస్‌ నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనుల విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ పనులకు సంబంధించి టెండరు దక్కించుకున్నా.. నిధులు సరిపోవంటూ ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న ప్రభుత్వ సంస్థ తిరిగి తామే చేపడతామంటూ ముందుకొచ్చింది. ఈ మేరకు వర్సిటీ అధికారులకు సమాచారమిచ్చింది. 25 ఏళ్లయినా కేయూ ప్రహరీ నిర్మాణం జరగకపోవడం, దీంతో వర్సిటీ భూమి కబ్జాలకు గురవుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘కేయూ ప్రహరీ.. మళ్లీ మొదటికి..’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.


దీనిపై.. నిర్మాణ పనుల టెండరు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం కేయూ ఉన్నతాధికారులు, డెవల్‌పమెంట్‌ అధికారులకు టీజీఈడబ్ల్యూఐడీసీ ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయు. ఈ నెల 7న స్వయంగా యూనివర్సిటీకి వచ్చి వీసీ, రిజిస్ట్రార్‌, డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, ఎఫ్‌వో, ఇతర అధికారుల సమక్షంలో పనులకు సంబంధించి తుది ఒప్పందం చేపడతామని టీజీఈడబ్ల్యూఐడీసీ ఉన్నతాధికారులు గణపతి, నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌ సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఎట్టకేలకు ప్రహరీ నిర్మాణ పనులు మొదలు కానుండడంతో వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:31 AM