చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:03 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు నిల్వల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చెల్పూర్ కేటీపీపీ (కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ నిల్వల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత కారణంగా బొగ్గు నిల్వల్లో వేడి పెరిగి ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో కిలోమీటర్ల మేరకు నల్లని పొగ వ్యాపించింది, దీంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పరిస్థితిని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు
పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం