Share News

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు

ABN , Publish Date - Apr 16 , 2026 | 02:47 PM

సౌత్, నార్త్ అంటూ కాంగ్రెస్ పెద్ద కుట్ర చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో మహిళా బిల్లు అమలు చేయాలన్న రాహుల్‌గాంధీ.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు
Ramchander Rao

హైదరాబాద్, ఏప్రిల్ 16: కాంగ్రెస్ మరోసారి దేశ విభజనకు కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌ రావు(TBJP Chief Ramchander Rao) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సౌత్, నార్త్ అంటూ కాంగ్రెస్ పెద్ద కుట్ర చేస్తోందన్నారు. గతంలో మహిళా బిల్లు అమలు చేయాలన్న రాహుల్‌గాంధీ.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. నార్త్‌లో కాంగ్రెస్ పోయిందని.. త్వరలో సౌత్‌లో కూడా పోతుందంటూ వ్యాఖ్యానించారు. రేవంత్‌ ట్రాప్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పడరని.. సౌత్ ప్రజలు తెలివైన వారన్నారు.


రేవంత్ రెడ్డి నార్త్ సౌత్ డివిజన్ రాజకీయాలు చేస్తున్నారంటూ టీబీజేపీ చీప్ మండిపడ్డారు. రీజినల్ పార్టీలు మాట్లాడుతున్నాయంటే ఏదో అనుకోవచ్చు.. కానీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్

ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని తండ్రి పన్నాగం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 02:51 PM