Share News

పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:03 PM

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. అమెరికా ‘నేషనల్ వార్ కాలేజ్’ బృందంతో మంత్రి సమావేశమయ్యారు.

పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
Sridhar Babu

హైదరాబాద్, ఏప్రిల్ 16: అమెరికా ‘నేషనల్ వార్ కాలేజ్’ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈరోజు(గురువారం) సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో స్కిల్డ్ వర్క్‌ ఫోర్స్ సిద్ధంగా ఉందని.. TG-iPASS ద్వారా 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. టెక్నాలజీ, రీసెర్చ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


ఏరోస్పేస్ రంగం ఏటా సగటున 30 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఎగుమతుల్లో 103 శాతం సీఏజీఆర్‌తో తెలంగాణ దూసుకుపోతోంది. రాకెట్ల నుంచి శాటిలైట్ల వరకు అన్ని ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ముద్ర పడుతోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1500కి పైగా ఎంఎస్‌ఎంఈలతో తెలంగాణ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదుగుతోంది. ‘కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీ’గా హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. వరుసగా ఐదు సార్లు ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును అందుకోవడం తెలంగాణ సాధించిన మరో విజయం.


ఇవి కూడా చదవండి...

ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని తండ్రి పన్నాగం

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 04:21 PM