చైనా రెస్టారెంట్‌లో ఏఐ రోబోలు.. మీ నాలుక చూసి మీరేం తినాలో చెబుతాయి..
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:43 PM
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్‌జౌ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్‌జౌ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి. ఈ వినూత్న టెక్నాలజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (AI robot waiter China).
రెస్టారెంట్‌లోకి ఓ కస్టమర్ ప్రవేశించగానే.. రోబో వెయిటర్ అతడి మొహం, నాలుకను స్కాన్ చేస్తుంది. కొన్ని ప్రశ్నలు అడిగి డేటా సేకరించి దానిని ఏఐ ద్వారా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ ఆరోగ్యం, జీర్ణశక్తి, మూడ్ ఆధారంగా సరైన డిష్‌ను సూచిస్తుంది. ఆ రెస్టారెంట్‌లో సుమారు 8 రోబోలు పనిచేస్తున్నాయి. అవి ఆర్డర్ తీసుకోవడం, వంట చేయడం, సర్వింగ్, క్లీనింగ్‌తో వంటి చాలా పనులు చేస్తున్నాయి (Robot restaurant Hangzhou).
అంతే కాదు ఆ రోబోలు వందకు పైగా వంటకాలను స్వయంగా తయారు చేయగలవు (AI food recommendation system). ఆ రెస్టారెంట్‌లోని మొత్తం పని భారంలో దాదాపు 60% ఈ రోబోలే చేస్తున్నాయి. ఈ ఏఐ రోబోలు కేవలం వెయిటర్లలా మాత్రమే కాకుండా.. డిజిటల్ న్యూట్రిషనిస్ట్‌ల్లా పని చేస్తున్నాయి. ఏదేమైనా ఈ ఏఐ రోబోలు భవిష్యత్తులో ఫుడ్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఏఐ టెక్నాలజీ ఇప్పుడు మన ప్లేట్ వరకు వచ్చేసింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్
వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక
లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..