Share News

ఇంత నిర్లక్ష్యమా.. డాక్టర్ చేసిన పనికి క్షణాల్లో ప్రాణం కోల్పోయిన రోగి..

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:42 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ మెడికల్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వైద్యుడు చేసిన పొరపాటు వల్ల రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయాడు. శస్త్రచికిత్స సమయంలో రోగి ప్లీహాన్ని తీయాల్సిన డాక్టర్ పొరపాటున లివర్‌ను తొలగించాడు.

ఇంత నిర్లక్ష్యమా.. డాక్టర్ చేసిన పనికి క్షణాల్లో ప్రాణం కోల్పోయిన రోగి..
Florida doctor surgery error

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ మెడికల్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వైద్యుడు చేసిన పొరపాటు వల్ల రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయాడు. శస్త్రచికిత్స సమయంలో రోగి ప్లీహాన్ని తీయాల్సిన డాక్టర్ పొరపాటున లివర్‌ను తొలగించాడు. దీంతో ఆ రోగి మరణించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా, సంబంధిత డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు (Florida doctor surgery error).


ఫ్లోరిడాకు చెందిన 70 ఏళ్ల విలియం బ్రయాన్ అనే వ్యక్తి 2024 ఆగస్ట్‌లో కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లారు. పలు టెస్ట్‌లు చేసిన డాక్టర్ థామస్ షక్నోవ్ ‌స్కీ ఆపరేషన్ చేసి ప్లీహం తీసెయ్యాలని చెప్పారు. ఆపరేషన్ చేయించుకునేలా పేషెంట్‌ను బలవంతం చేశారు. విలియం ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నారు, కానీ డాక్టర్ మాయమాటలకు లొంగిపోయారు. ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్.. పేషెంట్ ప్లీహానికి బదులుగా అత్యంత కీలకమైన కాలేయాన్ని తొలగించాడు (Liver removed instead of spleen).

doctor1.jpg


ఈ ఘోరమైన పొరపాటు వల్ల విలియం తీవ్ర రక్తస్రావానికి గురై, ఆపరేటింగ్ టేబుల్‌పైనే మరణించారు (Medical negligence US). రోగి శరీరంలో నుంచి డాక్టర్ 4.6 పౌండ్ల బరువున్న కాలేయాన్ని బయటకు తీసినపుడు, అక్కడున్న సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అది కాలేయమేనని అందరూ చెబుతునప్పటికీ, డాక్టర్ మాత్రం దాన్ని ప్లీహమని ప్రకటించాడు. ఆ పొరపాటును గ్రహించేసరికే చాలా ఆలస్యమైపోయింది. రోగి మరణించారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ డాక్టర్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. మొదటి జ్యుడిషియల్ సర్క్యూట్ ప్రాసిక్యూటర్.. డాక్టర్ థామస్ షక్నోవ్ ‌స్కీపై సెకండ్-డిగ్రీ మ్యాన్‌స్లాటర్ (పొరపాటుగా హత్య చేయడం) అభియోగాన్ని ప్రకటించారు. ఈ కేసులో డాక్టర్‌కు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్


వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక


లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

Updated Date - Apr 16 , 2026 | 05:01 PM