కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బీఆర్ఎస్ నేతలకు వ్యవహరిస్తున్నారు: రామచంద్ర రావు
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:41 PM
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. సూర్య వ్యాఖ్యలపై అర్థంపర్థం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. సూర్య వ్యాఖ్యలపై అర్థంపర్థం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని రామచంద్ర రావు మండిపడ్డారు. ఎంపీ సూర్య మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరని, బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తుందని అన్నారు.
'తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టీ చూడొద్దు. ఆయన తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చలేదు. జేఏసీలో బీజేపీ భాగంగా ఉంది. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా. తెలంగాణ ఏర్పాటుపై లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో బీఆర్ఎస్ ఇద్దరు సభ్యులు లేరు. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు ను కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుంది. దీంతో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరందరి ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా. వాజపేయి చాలా సాఫీగా ఒక్క రక్తం చుక్క పడకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చారు' అని రామచంద్ర రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి...
రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు
పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం