Share News

హలధారి.. అయోమయం.. రైతు బీమా ఉన్నట్లా! లేనట్లా.?

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:48 AM

మహబూబాబాద్‌ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో దిగులు పడుతున్నారు.

హలధారి.. అయోమయం.. రైతు బీమా ఉన్నట్లా! లేనట్లా.?
Rythu Bima, Telangana Govt

  • ఆగస్టు 13తో ముగిసిన ప్రీమియం

  • ఇంకా ప్రీమియం చెల్లించని ప్రభుత్వం

  • జిల్లాలో 1,46,052 మంది ఈ పథకంలో చేరిక

  • ఆందోళనలో అన్నదాతలు

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో దిగులు పడుతున్నారు. ఆగస్టు 13వ తేదీతో ప్రీమియం చెల్లింపు ముగియడంతో రైతుబీమా ఉన్నట్లా, లేనట్లా అని కర్షకులు అయోమయానికి గురవుతున్నారు. రైతులకు అండగా ఉన్న ఈ పథకం ప్రశ్నార్థకంగా మారింది. బీమా గడువు గడిచి 17 రోజులు అయిపోయినప్పటికి రాష ్ట్రప్రభుత్వం ప్రీమియం బకాయిలు ఎల్‌ఐసీకి చెల్లించకపోవడంతో సమయం ముగిసిపోయింది. ఈ పథకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇది కొనసాగుతుందా! లేదా? అనేది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆపత్కాలంలో కుటుంబాలకు అండ..

రైతుల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశం తో 2018లో గత నాటీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా అమల్లోకి తెచ్చింది. రైతులు సహజమరణం పొందినా.. ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులకు బీమా వర్తించే విధంగా ఎల్‌ఐసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు.


రైతులు మరణించిన సమయంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉంటే కేవ లం పది రోజుల్లో రైతుబీమా నగదు రై తు కుటుంబంలోని నామినీ ఖాతాల్లో జమ అయ్యేవి. రైతు మరణించిన తర్వాత ఆపత్కాలంలో వారి కుటుంబానికి ఈ పరిహారం ఆదుకునేది. అలాం టి ఈ పథకం ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగిసింది. ఆగస్టు 13 తేదీలోపే ప్రభుత్వం ఈ బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చెల్లించకపోవడంతో 14వ తేదీ ఉదయం నుంచే ఈ పథకం గడువు ముగిసిపోయింది.


ఇందిరమ్మ బీమాతోనేనా.?

ఇందిరమ్మ బీమా పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుంబానికి బీమా సౌకర్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో రైతు బీమాను తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


hnk3.3.jpgజిల్లాలో 5,644 మంది రైతులు మృతి..

జిల్లాలో రైతుబీమా పథకంలో 1,46,052 మంది రైతులు చేరారు. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5,644 మంది రైతులు చనిపోయారు. వారికి రైతు బీమా పథకం అమలు చేయగా, రూ.282.20 లక్షల బీమా పరిహారాన్ని రైతుల నామీనీ ఖాతాలో జమ చేసిం ది. అయితే 2025-26లో 827 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. రైతు బీమా కోసం వారి కుటుంబాలు ఆర్జీ పెట్టుకుంటే ఆగస్టు 13వ తేదీ వరకు 726 మంది రైతులకు సెటిల్‌ చేసి బీమా పరిహారం రైతు కుటుంబాలకు అందించారు. ఇంకా 101 మంది రైతులకు భీమా పరిహారం అందలేదు. ఆ రైతులు కార్యాలయాల చుట్టూ బీమా పరిహారం కోసం తిరుగుతున్నారు. ఆ రైతులకు పరిహారం సెటిల్‌మెంట్‌ చేస్తారని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికి ఆ పరిహారం.. అందుతుందా...? లేదా అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు..?


వ్యవసాయాధికారుల అప్రమత్తం..

రైతు బీమా పథకం ఆగస్టు 13 అర్ధరాత్రి నుంచే ముగిసిన తర్వాత గత 14 నుంచి బీమా పథకం వర్తించదు. దాంతో రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నార్థకంగా మారింది. 14వ తేదీ తర్వాత బీమా చేసుకున్న రైతులు మరణిస్తే వారి పరిస్థితి ఏమిటనేది తెలియరావడం లేదు. అయితే రైతులు 14 తేదీ తర్వాత మరణిస్తే 13వ తేదీకి ముందే మృతి చెందినట్లు తప్పుడు ధ్రువపత్రాలు తెచ్చి రైతుబీమా కోసం దరఖాస్తు చేస్తారని అప్రమత్తంగా ఉం డాలని జిల్లా వ్యవసాయాధికారులు ఏఈవోలను హెచ్చరిస్తున్నారు.


రైతు మరణించిన తేదీని సంబంధిత అధికారులు ఇచ్చిన అధికారిక పత్రాలను, రికార్డులను కచ్చితంగాపరిశీలించాలని ఏఈవోలను ఆదేశించారు. ఇప్పటికైనా రైతు బీమా పథకం అమలు ఉన్నట్లా! లేదా అనేది? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

  • 2026-27 సంవత్సరంలో 827 మంది మృతి చెందగా 726 మందికి బీమాను సెటిల్‌ చేశారు. ఇంకా 101 మంది మిగిలి ఉన్నారు.

hnk3.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బస్తాలో పది శాతానికి మించి నూకలే..

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 11:48 AM