Share News

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:06 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు.

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..
Warangal

వరంగల్: రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె(21)పై నిన్న(బుధవారం) రాత్రి రావూరు తండాకి చెందిన నలుగురు అత్యాచారం చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అత్యంత పాశవికంగా ఆమెను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


అనంతరం ఆమెను ఉరి వేసి చంపేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితురాలు తీవ్ర రక్త స్రావంతో మృతిచెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్ధన్నపేటలో మార్చురీ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. మెుక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Updated Date - Apr 09 , 2026 | 07:24 PM