శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల తగ్గింపు
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:17 AM
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.
దేశీయ ప్రయాణికులకు రూ.515,
అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.1,030గా నిర్ణయం
సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్, ఆగస్టు 25: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది. ప్రయాణికులపై విధిస్తున్న యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల(యూడీఎ్‌ఫ)ను బాగా తగ్గించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.1500 నుంచి రూ.1,030కి(రూ.470తగ్గింపు), దేశీయ ప్రయాణికులకు రూ.750 నుంచి రూ.515కి(రూ.235తగ్గింపు) యూడీఎఫ్ చార్జీలను తగ్గించారు.
ఇది సెప్టెంబరు 1నుంచి అమల్లోకి వస్తుంది. 2031 మార్చి 31వరకు అమల్లో ఉంటుంది. యూడీఎఫ్ చార్జీలను టికెట్ రేటులో భాగంగానే వసూలు చేస్తారు. తాజా తగ్గింపుతో ఈ మేరకు టికెట్ రేట్లలో కూడా మార్పులు ఉంటాయి. కాగా, ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే విమానాల సంస్థలకు విధించే ల్యాండింగ్ చార్జీలను కూడా సవరించారు. దేశీ విమానాలకు టన్నుకు రూ.435, అంతర్జాతీయ విమానాలకు రూ.630 చొప్పున వసూలు చేయనున్నారు.