Share News

తల్లిదండ్రుల వద్దకు వెళ్లను.. బాతులకు కాపలా కాయమంటున్నారు

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:19 AM

‘నాకు చదువుకోవాలని ఉంది...బాతులను పెంచడం ఇష్టం లేదు.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లను’ అంటూ తేల్చిచెప్పిన ఓ ఏడేళ్ల బాలికను పోలీసులు బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు.

తల్లిదండ్రుల వద్దకు వెళ్లను.. బాతులకు కాపలా కాయమంటున్నారు
Telangana Child Welfare News

  • ఏడేళ్ల చిన్నారి ఆవేదన..సీడబ్ల్యూసీకి అప్పగింత

అడ్డగూడూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘నాకు చదువుకోవాలని ఉంది...బాతులను పెంచడం ఇష్టం లేదు.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లను’ అంటూ తేల్చిచెప్పిన ఓ ఏడేళ్ల బాలికను పోలీసులు బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేట శివారులో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కుటుంబం బాతుల పెంపకం కోసం వలస వచ్చి అజీంపేట శివారులోనివాసం ఉంటోంది.


ఈ కుటుంబానికి ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో రెండో సంతానమైన ఏడేళ్ల బాలికను వారి తల్లిదండ్రులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తమ బంధువుల వద్ద బాతులకు కాపలాగా ఉంచారు. రెండురోజులకు ఒకసారి కుమార్తె వద్దకు వెళ్లి చూసి వస్తున్నారు. శనివారం సాయంత్రం బంధువులు బయటకు వెళ్లటంతో బాలిక ఒంటరిగా ఉంది. రాత్రి 7.30 వరకు ఎవరూ రాకపోవడంతో భయాందోళనకు గురైన చిన్నారి.. కేకలు వేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అడ్డగూడురు ఎస్సై వెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు చదువుకోవాలని ఉందని, బాతులను పెంచడం ఇష్టం లేదని చెప్పటంతో ఆశ కార్యకర్త సమక్షంలో సదరు బాలికను భువనగిరి బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:19 AM