ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ఆమోదం
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:00 PM
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం లభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం లభించింది. రెండు డీఏలను ఆమోదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2500 కోట్ల భారం పడనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం నుంచి ఈ డీఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. కేబినెట్ భేటీ ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్ల నుంచి 19,892 మెగావాట్లకు పెరిగిందని అన్నారు. విద్యుత్ సమస్య రాకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 5800 మెగావాట్ గ్రీన్ పవర్ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు.
అలాగే ఈ ఏడాది 17 శాతమే వర్షపాతం నమోదైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఎల్ నినో వల్ల తాగునీటి సమస్య వస్తోందని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 650కోట్ల నిధుల విడుదలకు ఆమోదించామన్నారు. 22ఏ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఈపీసీ ప్రాజెక్టుల రద్దుకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.
ఈ వార్తలూ చదవండి
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్..
లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్