తెలంగాణలో కొత్తగా 460 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:55 AM
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను కూడా అధికారులు చేపట్టారు.
మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 36,353కు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన సీఈఓ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను కూడా అధికారులు చేపట్టారు. తెలంగాణలో నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, స్థలాల మార్పు, పేర్ల సవరణ, తొలగింపు, విలీన ప్రతిపాదనలకు భారత ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,985 ఉండగా... అందులో ఓటర్ల సంఖ్య అతి తక్కువగా ఉన్న 92 కేంద్రాలను విలీనం చేశారు. దీంతో కొత్తగా నిర్ణయించిన 460 కలుపుకొని రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇప్పుడు 36,353కు పెరిగింది. అదే సమయంలో 551 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి స్థలాలను, 335 కేంద్రాల పేరు, వివరాలను మార్చినట్లు సీఈఓ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News