ఆ గ్రామంలో మందు అమ్మినా, తాగినా.. రూ.50 వేల జరిమానా
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:18 PM
సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పెద్దమాసానపల్లి గ్రామం.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో.. ఊరి బాగు కోసం గ్రామస్థులంతా కలిసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
సిద్దిపేట, జూన్ 04: జిల్లాలోని తోగుట మండలం పెద్దమాసానపల్లి గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటూ యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమై.. ఊరిలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలంతా పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ తీర్మానం ప్రకారం.. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా లేదా మద్యం సేవించినా వారికి రూ. 50,000 జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ హెచ్చరించింది. అంతేకాకుండా మద్యం విక్రయించే వారి గురించి లేదా తాగే వారి గురించి సమాచారం అందించిన వారికి రూ. 1,000 నజరానా కూడా అందజేస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా, మద్యరహితంగా మార్చాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News