పవన్ ఇండస్ట్రీస్‌లో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:09 AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ-మంగల్‌పల్లి మధ్య ఉన్న పవన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.
సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్
రూ.20 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తింపు
ఇబ్రహీంపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ-మంగల్‌పల్లి మధ్య ఉన్న పవన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. రూ.20 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు.
పవన్ ఇండస్ట్రీస్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని పవన్ ఇండస్ట్రీస్ సేకరించింది. మూడేళ్లలో 1.76 లక్షల ధాన్యం బస్తాలు(ఒక్కోటి 40 కిలోలు) మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News