శంషాబాద్‌లో కలకలం.. తెల్లటి సంచిలో రోజుల పసికందు
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:39 PM
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డుపై రెండు రోజుల ఆడ శిశువు లభ్యమైంది. తెల్లటి సంచిలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి, జులై 21: జిల్లాలోని శంషాబాద్‌లో కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డుపై రెండు రోజుల ఆడ శిశువు లభ్యమైంది. తెల్లటి సంచిలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌జీఐఏ(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పసికందును రక్షించారు. అనంతరం శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ఆ చిన్నారిని అమీర్‌పేట్ శిశు విహార్ సంరక్షణలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శిశువును అక్కడ వదిలివెళ్లిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులెటిన్ విడుదల
వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ
Read Latest Telangana News And Telugu News