Share News

వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ

ABN , Publish Date - Jul 21 , 2026 | 02:17 PM

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం ఘనంగా జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారన్నారు.

వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha

హైదరాబాద్, జులై 21: బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణం అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణం ఘనంగా జరిగిందన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారన్నారు. ప్రత్యేక సమీక్షలు చేసి, ఇచ్చిన ఆదేశాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పట్లు చేయడంతో ఘనంగా కల్యాణం జరిగిందని తెలిపారు. VIP దర్శనాలు, వికలాంగులు, జోగినిలకు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడంతో తోపులాట, తొక్కిసలాట జరగలేదన్నారు.


జోగినిలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో పాటు వారు తెచ్చిన పట్టువస్త్రాలను అమ్మవారికి చేరవేశామని.. వారిని vip గ్యాలరీలో తమతో సమానంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వర్షాల కోసం వరుణయాగం జరుగుతోందన్నారు. నిజాం కాలం నుంచి అమ్మవారికి ప్రాముఖ్యం ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకొంటే కోరికలు నేరవేరుతాయని నమ్మకమని చెప్పారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని అన్నారు. ఖర్చుల కోసం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయాలకు బడ్జెట్ కేటాయించామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


అమ్మవారి కృపాకటాక్షంతో వర్షాలు కురుస్తాయి: మంత్రి పొన్నం

మహిమగల బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. లోకకల్యాణం కోసం ఘనంగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నామని.. ఎన్‌లినోను కూడా ఎదుర్కుంటామన్నారు. అమ్మవారి కృపాకటాక్షంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. సంవృద్ధిగా వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగేలా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయని.. వాటిని అధిగమించి అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర మీద ఉండాలని, సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్

‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులెటిన్ విడుదల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 02:34 PM