Share News

గత పాలనలో ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను తిరిగి కాపాడాం: మంత్రి నిమ్మల రామానాయుడు

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:35 PM

నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒకవైపు వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థ .. మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్‌ను అప్పగించారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు.

గత పాలనలో ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను తిరిగి కాపాడాం: మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu

అమరావతి, జులై 21: నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థ .. మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్‌ను అప్పగించారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. నేడు ఇరిగేషన్ శాఖ.. క్యాలెండర్‌ను కూడా రూపొందించుకున్నట్లు తెలిపారు. పోలవరం రాష్ట్రానికి వరం, జీవమన్నారు. 72 శాతం పోలవరాన్ని నాడే పూర్తిచేశామని.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021-22 నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు.


2019లో అధికారంలో ఉన్న నాటి ప్రభుత్వం 17 నెలల పాటు పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హమీని కూడా నాటి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. చివరకు పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు. పోలవరం రీయింబర్స్‌మెంట్ సొమ్ములను కూడా నాటి ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. పోలవరానికి సంబంధించి ఈసీఆర్‌ఎఫ్ డ్యాం అత్యంత కీలమని.. డ్యాం పనులు 31 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. రైట్, లెఫ్ట్ కనెక్టివిటీని పూర్తిచేయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు ఈ రెండేళ్లలోనే రూ. 2250 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకమైన ప్రాజెక్టును తిరిగి కాపాడామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ములుగును ముంచెత్తిన వాన!.. 7.66 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు

జీవో నం.3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు సానుకూలం: మంత్రి సంధ్యారాణి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 02:22 PM