Share News

ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

ABN , Publish Date - Jul 21 , 2026 | 02:45 PM

దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది.

ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
CM Chandrababu

అమరావతి, జులై 21: దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకు వచ్చింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది.


ఆంధ్రప్రదేశ్‌లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చించింది. ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆహ్వానానికి స్పందించిన యూఏఈ.. ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. ఈ భాగస్వామ్యంతో మామిడి, అరటి, కోకోతో పాటు వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో యూఏఈ ప్రతినిధుల బృందంతో పాటు మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి(EDB) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

జీవో నం.3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు సానుకూలం: మంత్రి సంధ్యారాణి

భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 03:40 PM