Share News

జన గణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:34 AM

వచ్చే జన గణనలో బీసీ జన గణన కోసం ప్రత్యేక కాలమ్‌ పెట్టాలని, అలాగే ప్రతి కులానికి ఒక కోడ్‌ ఇవ్వాలని.. ఈమేరకు కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సాధ్వి నిరంజన్‌ జ్యోతికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.

జన గణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి
R Krishnaiah

  • జాతీయ బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌కు ఆర్‌.కృష్ణయ్య వినతులు

న్యూఢిల్లీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వచ్చే జన గణనలో బీసీ జన గణన కోసం ప్రత్యేక కాలమ్‌ పెట్టాలని, అలాగే ప్రతి కులానికి ఒక కోడ్‌ ఇవ్వాలని.. ఈమేరకు కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సాధ్వి నిరంజన్‌ జ్యోతికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంక్షేమ సంఘం చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకులు సాధ్వి నిరంజన్‌ జ్యోతితో భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్తూ.. దేశంలో జన గణనలో కుల గణన చేపడుతున్న కేంద్రప్రభుత్వం ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్‌ను కూడా చేర్చితే బీసీల లెక్కలు కచ్చితంగా తెలుస్తాయని కృష్ణయ్య అన్నారు. ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్‌ను చేర్చినట్లుగానే బీసీలకు కూడా ప్రత్యేక కాలమ్‌ పెడితే తప్పేముంది? అని ప్రశ్నించారు. కుల గణన చేస్తున్నందున ప్రత్యేక కాలమ్‌ పెడితే కొన్ని రాజకీయ పార్టీలు, బీసీ కుల సంఘాలు లేవనెత్తుతోన్న అనుమానాలు తొలగిపోతాయని ఇందుకోసం రాజ్యాంగ సంస్థ అయిన బీసీ కమిషన్‌ జోక్యం చేసుకొని కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆర్‌.కృష్ణయ్య కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:34 AM