Share News

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన

ABN , Publish Date - Feb 15 , 2026 | 10:38 AM

సిద్దిపేటలో అబార్షన్ ఫెయిల్ కావడంతో ఓ మహిళ చనిపోయింది. వైద్యుడి నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే..

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన
Siddipet Private Hospital Protest

ఇంటర్నెట్ డెస్క్: సిద్దిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. అబార్షన్ ఫెయిల్ కావడంతో ఓ మహిళ చనిపోయింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణి చికిత్స తీసుకుంటోంది. ఆమె స్కానింగ్ రిపోర్టులు చూసిన వైద్యుడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ హార్ట్‌లో హోల్ ఉందని చెప్పాడు. వెంటనే అబార్షన్ చేయాలని, లేదంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశముందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.


అయితే.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు ఆపరేషన్ చేశారు వైద్యులు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. రక్త స్రావం ఎక్కువవడంతో ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాలని, సదరు ఆస్పత్రి సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

For TG News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 11:20 AM