ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-15T23:47:01+05:30 IST

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న హృదయరాజు

- కేంద్రాలను పరిశీలించిన నోడల్‌ అధికారి

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 15 : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీంతో పాటు వృత్తి విద్య కోర్సుకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. మొదటి విడతగా నిర్వహిస్తున్న పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జనరల్‌ వారికి తొమ్మిది, వృత్తి విద్య విద్యార్థులకు నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు జనరల్‌ విద్యార్థుల్లో 421 మందికి, 397 మంది హాజరయ్యారు. 24 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విద్యార్థులు 373 మందికి, 339 మంది పరీక్షకు వచ్చారు. 34 మంది పరీక్షకు హాజరు కాలేదు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 328 మందికి గాను 314 మంది, వృత్తి విద్య పరీక్షకు 391 మందికి, 350 మంది హాజరయ్యారు. 55 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి ఎం.హృదయరాజు పరిశీలించారు.

Updated Date - 2023-02-15T23:47:03+05:30 IST