Share News

హ్యామ్ రోడ్ల కోసం రూ.9.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఓకే

ABN , Publish Date - Nov 10 , 2026 | 09:34 PM

తెలంగాణలో హ్యామ్ రోడ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. హ్యామ్‌ రోడ్ల నిర్మాణం కోసం ఆర్ అండ్ బీకి హడ్కో రూ.9.2 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. అతి తక్కవ వడ్డీ ఈ రుణం ఇవ్వనుంది.

హ్యామ్ రోడ్ల కోసం రూ.9.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఓకే

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో హ్యామ్ రోడ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. హ్యామ్‌ రోడ్ల నిర్మాణం కోసం ఆర్ అండ్ బీకి హడ్కో రూ.9.2 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో సుమారు 6,092 కి.మీ. రహదారులను రూ.13,006 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తీసుకునే రూ. 9,100 కోట్ల రుణానికి సంబంధించి వడ్డీ రేటుపై హడ్కో, ఆర్థిక శాఖ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చింది. తొలుత వేర్వేరు కాలపరిమితులకు 8.6 శాతం, 9.1 శాతం వడ్డీ రేట్లను ప్రతిపాదించిన హడ్కో.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం 15 సంవత్సరాలకు 8.6 శాం వడ్డీ రేటుతో రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాల్సిన 60 శాతం వాటా నిధులకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు అందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ప్రభుత్వ వాటా నిధులకు ఆర్థిక శాఖ తుది అనుమతులు రాగానే పనులు ఊపందుకోనున్నాయి.


అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సుమారు 7,449 కి.మీ. మేర 2,162 గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 6,294.81 కోట్లతో పిలిచిన 17 ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. రాబోయే రెండు నెలల్లో రుణాలు మంజూరై సంక్రాంతి నాటికి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి హడ్కో వడ్డీ రేట్ల వివాదం పరిష్కారం కావడం, గ్రామీణ రోడ్ల టెండర్లు ఖరారు కావడంతో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్లయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Updated Date - Nov 10 , 2026 | 09:35 PM