Share News

ఆర్టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ మోసం

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:03 AM

ఆర్టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్‌ నేరగాళ్లు ఒక యువకుడి నుంచి రూ.5 లక్షలు కాజేశారు.

ఆర్టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ మోసం
RTA challan scam

  • రూ. 5లక్షలు మాయం..

  • బాధితుడు నిజామాబాద్‌ జిల్లా వాసి

ఆర్మూర్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్‌ నేరగాళ్లు ఒక యువకుడి నుంచి రూ.5 లక్షలు కాజేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన పెండ అంబేడ్కర్‌ ఫోన్‌కు మంగళవారం ఆర్టీఏ చలాన్‌ పేరిట ఏపీకే ఫైల్‌ వచ్చింది. తన మోటార్‌ సైకిల్‌కు ఏమైనా చలానాలు పడ్డాయేమోనని భావించిన బాధితుడు, ఆ లింక్‌ తెరిచి తనిఖీ చేశాడు. వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి దశలవారీగా రూ. 5లక్షలు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన అంబేడ్కర్‌ ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:03 AM