Share News

లైంగిక దాడి కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:39 AM

పన్నెండేళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన యువకుడికి రెండు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్‌చార్జి, స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి దారావత్‌ దుర్గాప్రసాద్‌ గురువారం తీర్పు వెలువరించారు.

లైంగిక దాడి కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు

  • నిజామాబాద్‌ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు

నిజమాబాద్‌ లీగల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన యువకుడికి రెండు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్‌చార్జి, స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి దారావత్‌ దుర్గాప్రసాద్‌ గురువారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన షేక్‌ ఏజాజ్‌(20)పై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్షలు విధించింది. దీంతో పాటు బాధితురాలిపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు రెండేళ్ల కారాగార శిక్ష కూడా విధించారు. జైలు శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని పేర్కొన్నారు.


కాగా కోర్టు నిందింతుడికి రూ.60 వేల జరిమానా సైతం విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం 2021 సంవత్సరంలో నిందితుడు షేక్‌ ఏజాజ్‌ పన్నెండేళ్ల బాలికను బెదిరింపులకు గురిచేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా ఆమె ఆరు నెలల గర్భిణి అని తెలిసింది. ఈ క్రమంలో బాలిక షేక్‌ ఏజాజ్‌ తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని వెల్లడించింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికకు గర్భవిచ్ఛిత్తి చేయడం వల్ల ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో గర్భధారణ కొనసాగింది. అనంతరం బాలిక జన్మనిచ్చిన శిశువు రెండు రోజులకే మృతి చెందింది. కాగా బాధిత బాలికకు రూ.5 లక్షల ఆర్థిక పరిహారం అందించే విషయాన్ని పరిశీలించాలని నిజామాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయస్థానం సిఫారసు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 04:39 AM