డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:37 AM
సీఎంఆర్ బకాయిలు, ఎఫ్‌సీఐకి సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసిన వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎ్‌సవో) శ్రీకాంత్‌రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం సరఫరా కేసులో సీఐడీ చర్యలు
నిజామాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎంఆర్ బకాయిలు, ఎఫ్‌సీఐకి సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసిన వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎ్‌సవో) శ్రీకాంత్‌రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం అరెస్టు చేసిన ఆయనను విచారణ అనంతరం ఆదివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎంఆర్ బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం, రైస్‌మిల్లుల తనిఖీలు, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా సమయంలో నాణ్యతను ధ్రువీకరించిన అంశాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో శ్రీకాంత్‌రెడ్డి పాత్రపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News