15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:30 PM
నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహించిన ధారావత్ బాలాజీ.. లంచం కేసులో దోషిగా ట్రయిల్ కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది.
నిజామాబాద్, నవంబర్11: జిల్లాలో పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహించిన ధారావత్ బాలాజీ.. లంచం కేసులో దోషిగా ట్రయిల్ కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2011లో లంచం డిమాండ్ చేశారనే ఆభియోగంతో అతడిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.15 ఏళ్ల తర్వాత ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఒక్కో అభియోగంపై ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏకకాలంలో రెండు శిక్షలు అమలు చేయాలని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.
అలాగే ధారావత్ బాలాజీకి రూ.10 వేల జరిమానా కూడా కోర్టు విధించింది. గతంలో డచ్‌పల్లిలో ధారావత్ బాలాజీ సీఐగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కేసులో బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అతడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాంతో ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత మాజీ సీఐకు కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులకు ప్రత్యేక శిక్షణ
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News