కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా
ABN , Publish Date - May 02 , 2026 | 03:54 PM
కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ తెలిపారు.
కామారెడ్డి, మే 2: కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది సుమంత్ వెల్లడించారు. శనివారం మీడియాతో న్యాయవాది మాట్లాడుతూ.. కేసు వివరాలను తెలియజేశారు. గత ఫిబ్రవరి 17, 21 తేదీల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్‌పై అత్యాచారం కేసు ఉందని అనుచిత వ్యాఖ్యలు చేశారని, నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది తెలిపారు.
వాస్తవాలు వక్రీకరించి తన పరువుకు నష్టం కలిగించారని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇలియాస్ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో ఫిర్యాదు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. క్రిమినల్ డిఫెన్స్ కింద ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఈ నెల 20న ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు న్యాయవాది సుమంత్ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక న్యాయవాదులు సతీష్, స్టీఫెన్ నాగరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత
కిందస్థాయి సిబ్బందితో ఫ్రెండ్లీగా ఉండండి.. ఆర్టీసీ అధికారులతో పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And Telugu News