Share News

ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

ABN , Publish Date - Aug 13 , 2026 | 03:04 PM

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి
Road Accident

నిజామాబాద్, ఆగస్టు 13: జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ అవడంతో బస్సును డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదుట ఉన్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఇదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది.


ఈ క్రమంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు టైర్ ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 03:29 PM