గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:15 PM
గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సర్వీసులను ప్రారంభించారు.
కృష్ణా, ఆగస్టు 13: గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సర్వీసులను ప్రారంభించారు. దీంతో గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతాకు కొత్త సర్వీసులను ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో నడపనుంది. వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడవనున్నాయి. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతాకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఇండిగో సంస్థ వెల్లడించింది.
సమయాల వివరాలు:
ఫ్లైట్ నంబర్ 6E 6501(వారణాసి-విజయవాడ సర్వీస్): మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరి, సాయంత్ర 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఫ్లైట్ నంబర్ 6E 6502(విజయవాడ-వారణాసి సర్వీస్): గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సాయంత్రం 06:20 గంటలకు బయలుదేరి, రాత్రి 08:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరిగి బయలుదేరి రాత్రి 10:15 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం(6E 6501): మధ్యాహ్నం 02:10 గంటలకు కోల్‌కతాలో బయలుదేరి, వారణాసి మీదుగా సాయంత్రం 05:50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
తొలి వేతనం అమర వీరుల కుటుంబాలకు.. గొప్ప మనసు చాటుకున్న ఎంపీ విజయ్
గొడ్డలిపార్టీ రెచ్చగొట్టినా.. రైతులు అమరావతికి సహకరించారు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News